M Venkaiah Naidu : విద్యాల‌యాల్లో స‌మాజ‌ సేవ అవ‌స‌రం

ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఉవాచ‌

M Venkaiah Naidu : దేశంలోని పాఠ‌శాలలు, కాలేజీల్లో క‌మ్యూనిటీ సేవ‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌న్నారు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు. ఇస్కాన్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీ‌ల ప్ర‌భుపాద వంటి గొప్ప సాధువులు , ఆధ్యాత్మిక నాయ‌కుల నుండి స్పూర్తి పొందాల‌ని సూచించారు.

మంచి మాన‌వులుగా మారేందుకు క్ర‌మ‌శిక్ష‌ణ‌, కృషి, స‌హ‌నం, తాదాత్మ్యం వంటి ల‌క్ష‌ణాలు అల‌వ‌ర్చు కోవాల‌ని వెంక‌య్య నాయుడు స్ప‌ష్టం చేశారు. విద్యా సంస్థ‌ల్లో స‌మాజ సేవలో విద్యార్థులు పాలు పంచుకునేలా చేయాల‌న్నారు.

ప్ర‌తి ఆదివారం లేదా సెల‌వు రోజుల‌లో సేవ చేయ‌డం అన్న‌ది భాగం కావాల‌ని స్పష్టం చేశారు. యువ‌త‌లో భాగ‌స్వామ్యం, సంర‌క్ష‌ణ స్ఫూర్తిని పెంపొందించేందుకు కృషి చేయాల‌న్నారు ఉప రాష్ట్ర‌ప‌తి.

ఇస్కాన్ వ్య‌వ‌స్థాప‌కుడి జీవిత చరిత్ర సింగ్, డ్యాన్స్ అండ్ ప్రే – ది ఇన్ స్పిరేష‌న్ స్టోరీ ఆఫ్ శ్రీ‌ల ప్ర‌భుపాద పుస్త‌క ఆవిష్క‌ర‌ణ స‌భ జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు ముప్ప‌వ‌ర‌పు వెంకయ్య నాయుడు. ఐక్య‌త‌, శాంతి, సామాజిక సామ‌ర‌స్యంతో కూడిన సార్వ‌త్రిక విలువ‌ల‌కు భార‌తీయ నాగ‌రిక‌త అండ‌గా నిలుస్తుంద‌న్నారు.

ఈ పురాత‌న విలువ‌ల‌ను సంర‌క్షించేందుకు , ప్ర‌చారం చేసేందుకు ఆధ్యాత్మిక పున‌రుజ్జీవ‌నం అనే కెరీర్ ను ఎంపిక చేసుకోవాల‌ని సూచించారు.

కులం, లింగం, మ‌తం, ప్రాంతం సంకుచిత‌త్వ భావ‌న‌ల‌కు అతీతంగా, దూరంగా ఉండాల‌ని సూచించారు వెంక‌య్య నాయుడు(M Venkaiah Naidu).

శ్రీ‌ల ప్ర‌భుపాదుల‌ను స‌మ‌తావాద ఆలోచ‌న‌కు జ్యోతులుగా అభివ‌ర్ణించారు ఉప రాష్ట్ర‌ప‌తి. ఇస్కాన్ సంస్థ చేస్తున్న కృషి గొప్ప‌ద‌న్నారు. భ‌గ‌వ‌ద్గీత‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌రివ్యాప్తం చేసిన ఘ‌న‌త ఇస్కాన్ దేన‌ని పేర్కొన్నారు.

Also Read : క‌ళ్లు..కాళ్లు భూమి మీదే ఉండాలి – నీర‌జ్ చోప్రా

Leave A Reply

Your Email Id will not be published!