Perni Nani : ఏపీ ప్రభుత్వం తాను ఎంప్లాయిస్ పట్ల ఉదారతను చాటుకుంది. ఇప్పటికే సీఎంగా కొలువు తీరాక జగన్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.
ఆయన ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మహిళా సాధికారత, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ విస్తరణపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇటీవలే ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ అమలు చేశారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని(Perni Nani ).
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థలోని 1800 మందికి పైగా ఉద్యోగులకు కుటుంబాలకు చెందిన వారిని ఈ అవకాశం లభిస్తుందని చెప్పారు. నియామకాలన్నీ సంబంధిత జిల్లాల్లోనే జాబ్స్ ఇస్తామని వెల్లడించారు.
ఇందులో భాగంగా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇందుకు సంబంధించి ఎంపిక చేసిన జాబితాలు జిల్లాల వారీగా పంపించడం జరిగిందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్పిందని కానీ తాము మానవతా దృక్ఫథంతో ఆర్టీసీకి భరోసా కల్పించడం జరిగిందన్నారు పేర్ని నాని. కాగా కేంద్ర సర్కార్ నిర్ణయాల వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని తెలిపారు.
విద్యుత్ బస్సులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలోనే 40 బస్సులు అందుబాటు లోకి వస్తాయని చెప్పారు పేర్ని నాని.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్థకు పూర్తి భద్రత కల్పించిన ఘనత ఒక్క ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు మంత్రి. 60 ఏళ్లు పైబడిన వారికి రాయితీలు ఇస్తామన్నారు.
Also Read : జగన్ సర్కార్‌పై దేశం సభా హక్కుల ఉల్లంఘన