Bandi Sanjay Case : బండి అవినీతిపై విచారణ జరిపించాలి
కార్పొరేటర్ కమల్ జిత్ సింగ్ ఫిర్యాదు
Bandi Sanjay Case : బీజేపీ మాజీ స్టేట్ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోరుతూ తను ప్రాతినిధ్యం వహించే లోక్ సభ నియోజకవర్గం నుంచే ఫిర్యాదు చేయడం విశేషం. కరీంనగర్ కు చెందిన కార్పొరేటర్ కమల్ జిత్ సింగ్ బుధవారం కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఒకనాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రారంభమైందని, ఆనాడు కార్పొరేటర్ గా పోటీ చేసిన ఎన్నికల్లో భార్య పుస్తెల తాడు అమ్మాడని, కానీ బీజేపీ స్టేట్ చీఫ్ అయ్యాక వివిధ పత్రికల్లో పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చారని, రూ. 100 కోట్లు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు.
ఇది తాము లేవదీసిన ప్రశ్నలు కాదని బీజేపీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అడిగిన మాటలని అందుకే ఆయనను కూడా ఇందులో భాగం చేస్తూ తాము బండి సంజయ్(Bandi Sanjay) పై ఫిర్యాదు చేసినట్లు కార్పొరేటర్ కమల్ జిత్ సింగ్ వెల్లడించారు.
ఇందులో దుబ్బాక ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. దీంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ పై ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ.
Also Read : Bandi Sanjay : కేబినెట్ లో చేరేందుకు బండి అనాసక్తి