Suvella Braverman : స‌రిహ‌ద్దుల వ‌ల‌స విధానంపై ఆందోళ‌న

యుకె హోమ్ సెక్ర‌ట‌రీ సుయెల్లా బ్రేవ‌ర్ మాన్

Suvella Braverman : యునైటెడ్ కింగ్ డ‌మ్ హోం శాఖ కార్య‌ద‌ర్శి సుయెల్లా బ్రేవ‌ర్ మాన్(Suvella Braverman) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు భార‌త్ పై చేసిన వ్యాఖ్య‌లు కీల‌కంగా మారాయి. భార‌త్ తో బ‌హిరంగ స‌రిహ‌ద్దుల వ‌ల‌స విధానం గురించి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎందుకంటే బ్రెగ్జిట్ తో ప్ర‌జ‌లు ఓటు వేసిన‌ట్లు తాను భావిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

యుకెలో ఎక్కువ మంది నివ‌సించే వ్య‌క్తుల స‌మూహం భార‌తీయ వ‌స‌ల‌దారులేన‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా సుయెల్లా బ్రేవ‌ర్ మాన్ గురువారం మాట్లాడారు. భార‌త‌దేశం చ‌ర్చ‌లు జ‌రుపుతున్న వాణిజ్య ఒప్పందం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. యుకెకి వ‌ల‌స‌ల‌ను పెంచుతుంద‌న్నారు.

బ్రెక్సిట్ ల‌క్ష్యాల‌కు విరుద్దంగా ఉంటుంద‌న్నారు యుకె హోం శాఖ కార్య‌ద‌ర్శి. కాగా ది స్పెక్టేట‌ర్ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భార‌తీయ సంత‌తికి చెందిన బ్రేవ‌ర్ మాన్ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ముగించేందుకు క‌ట్టుబ‌డి ఉండాల‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

యుకె ప్ర‌ధాన‌మంత్రి లిజ్ ట్ర‌స్ తో కీల‌క భేటీ జ‌రిగిన త‌ర్వాత యుకె హోం సెక్ర‌ట‌రీ దీనిపై మాట్లాడారు. లీసెస్ట‌ర్ ఘ‌ర్ష‌ణ‌ల‌ను నిందించారు. యునైటెడ్ కింగ్ డ‌మ్ లో ఎక్కువ మంది వ‌ల‌స‌దారులు భార‌తీయులేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు సుయెల్లా బ్రేవ‌ర్ మాన్(Suvella Braverman).

గ‌తంలో ఇదే యుకె హోం సెక్ర‌ట‌రీగా ఉన్న ఎన్నారై ప్రీతి ప‌టేల్ ఆధ్వ‌ర్యంలో తీసుకున్న చ‌ర్య‌లు అంత‌గా ప్ర‌భావితం చూప లేక పోయాయ‌ని భావించారు యుకె హోం సెక్ర‌ట‌రీ.

Also Read : న్యూజిలాండ్ ప్ర‌ధానితో జై శంక‌ర్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!