US Visa Delay : యుఎస్ వీసాల ఆలస్యంపై ఆందోళన
ఆన్ లైన్ పిటిషన్ ప్రారంభం
US Visa Delay : యుఎస్ కు వెళ్లాలని అనుకునే వాళ్లకు అమెరికా చేస్తున్న తాత్సారం మరికొంత ఆందోళన కలిగిస్తోంది. ఇందులో భాగంగా ప్రవాస భారతీయులు , విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా అమెరికా సర్కార్ కు గుర్తు చేసింది.
సాధ్యమైనంత త్వరగా వీసాలు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ . ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో సమావేశమైన ఆయన వీసాల జారీ ప్రక్రియలో చోటు చేసుకున్న ఆలస్యంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా చాలా మంది భారతీయులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వ అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వీసాల జారీ ప్రక్రియ త్వరగా జరపాలని కోరుతూ ఆన్ లైన్ పిటిషన్ ను ప్రారంభించారు. దీని ద్వారా అమెరికా సర్కార్ మేలుకొంటుందని వారు భావిస్తున్నారు.
వివిధ రకాల వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని(US Visa Delay) తగ్గించాలని విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్ ను కోరుతూ యుఎస్ ఆధారిత డయాస్పోరా బాడీ ఆన్ లైన్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లాభా పేక్ష లేని పిటిషన్ వెబ్ సైట్ ఛేంజ్. ఓఆర్జీలో పిటిషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది.
కరోనా కారణంగా వీసాల జారీలో ఆలస్యమైందని పేర్కొన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రస్తుత ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆన్ లైన్ ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.
Also Read : మార్కెట్ లోకి డిజిటల్ రూపాయి