Murugha Mutt Seer : మౌనం వీడిన మఠాధిపతి
క్లీన్ చిట్ తో బయటకు వస్తా
Murugha Mutt Seer : కర్ణాటక రాష్ట్రంలో పేరొందిన మురగ పీఠం మఠాధిపతిపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మౌనం వీడారు. తనపై కేసు చేయడంపై స్పందించారు.
సోమవారం పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు(Murugha Mutt Seer) బయటకు వచ్చారు. మౌనం వీడారు. తనపై సుదీర్ఘ కాలంగా సాగుతున్న కుట్రలో ఇది భాగమని ఆరోపించారు.
తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. తను నిర్దోషిగా బయట పడతానని చెప్పారు.
ఎవరూ అసహనానికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా తన అభిమానులు, అనుచరులు, సహచరులు, కుటుంబీకులు, పిల్లల పేరెంట్స్ సంయమనం పాటించాలని సూచించారు మఠాధిపతి.
దర్యాప్తు సంస్థకు తాను సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ప్రముఖ , ప్రతిష్టాత్మకమైన మఠాలలో మురుగ మఠం ఒకటిగా పేరొందింది.
లింగాయత్ కమ్యూనిటీకి ప్రతీకగా నిలిచింది ఈ మఠం. కాగా మఠం ప్రాంగణంలో పెద్ద ఎత్తున భక్తులు గుమిగూడారు. తనను అరెస్ట్ చేస్తారని జరుగుతున్న ప్రచారం సందర్భంగా తానే బయటకు వచ్చి మాట్లాడటం తన ధర్మమన్నారు.
ఇక్కడికి వచ్చిన వారు, రాని వారంతా చాలా మంది మురుగ మఠం బాధను(Murugha Mutt Seer) మీదిగా భావిస్తారని నాకు తెలుసు అన్నారు. నేను ధైర్యంగా మీ కోసం ఇక్కడ ఉన్నాను.
మీరు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ధైర్యం, సహనం, సంయమనం అవసరమన్నారు. గత 15 ఏళ్లుగా ఇలాంటి కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని వాటిని ఎదుర్కొంటూ వస్తున్నట్లు తెలిపారు.
ఎలాంటి పుకార్లు, ఊహాగానాలకు భక్తులు తొలొగ్గ వద్దని మఠాధిపతి కోరారు. ఈ అభియోగం వెనుక మాజీ ఎమ్మెల్యే ఎస్కే బవసరాజన్ హస్తం ఉందని ఆరోపించారు.
Also Read : ‘మురుగ మఠం’ కలకలం