PM Narendra Modi : ఆదరణ అద్భుతం తెలంగాణకు అభివందనం
త్యాగాలకు, పోరాటాలకు పెట్టింది పేరంటూ కితాబు
PM Narendra Modi : అశేష ప్రజానీకం తరలి వచ్చిన మీ అందరికీ వందనం. మిమ్మల్ని కన్న తెలంగాణకు అభివందనం అంటూ పేర్కొన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) .
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గతంలో పాలకులు బహుజనులను పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే భారత దేశం మాత్రం ఎక్కడా తొట్రుపాటుకు లోను కాలేదన్నారు మోదీ.
ప్రతి భారతీయుడికి ఉచితంగా వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేశామని, ఇది ఏ దేశంలో కూడా అమలు చేసిన దాఖలు లేవన్నారు ప్రధాన మంత్రి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పని చేస్తోందన్నారు.
గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికీ మంచి జరిగేలా చేసేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు నరేంద్ర మోదీ. దశాబ్దాల నుంచి వివక్షకు గురైన వారిని గుర్తించి సమాజంలో గౌరవం కలిగేలా తీసుకు వచ్చామని చెప్పారు.
ఉచితంగా రేషన్ , ఉచితంగా వ్యాక్సిన్ అందించామన్నారు. తెలంగాణలో బీజేపీ పట్ల నమ్మకం పెరుగుతోందన్నారు. హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నామన్నారు మోదీ(PM Narendra Modi) .
బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని, ప్రత్యేకించి అన్ని కోర్సులను దేశంలోని ప్రజలు ప్రతిరోజు వాడే వాడుక భాషలో ఉండాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రధాన మంత్రి.
Also Read : తెలంగాణ అభివృద్దికి కృషి చేశాం – మోదీ
Hon’ble PM Shri @narendramodi Ji addressing a rally at Hyderabad.https://t.co/u7GyYtmkRU
— Kiren Rijiju (@KirenRijiju) July 3, 2022