Arun Singh : కాంగ్రెస్ 3వ జాబితా ఇక రాదు
కర్ణాటక బీజేపీ ఇంఛార్జ్ అరుణ్ సింగ్
Arun Singh : కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఇంఛార్జ్ అరుణ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. వారికి సంబంధించిన అభ్యర్థుల లిస్టు 3వది ఇక రాదంటూ ఎద్దేవా చేశారు. తాము ఇప్పటి వరకు మొదటి జాబితాలో 189 మందిని, రెండో జాబితాలో 23 మందిని ఎంపిక చేశామన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క జాబితాను ప్రకటించిందన్నారు.
పార్టీలో అంతర్గత పోరు నడుస్తోందన్నారు అరుణ్ సింగ్(Arun Singh). వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 66 మంది కొత్త వారికి బీజేపీ టికెట్లు ఇచ్చిందని చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ ఎన్నికలలో టికెట్లు లభించవని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న పార్టీకి ఇలాంటి తలనొప్పులు సహజమేనని పేర్కొన్నారు.
టికెట్లు నిరాకరించినందుకు బాధకు గురి కావడం తనను బాధకు గురి చేసిందన్నారు. కానీ బీజేపీ సభ్యులు మాత్రం భావజాలం కోసం పని చేస్తారని చెప్పారు. పార్టీలో నుంచి కొందరు నాయకులు వెళ్లినంత మాత్రాన ఏమీ కాదన్నారు. తమకు ఏ పార్టీకి లేనంతమంది కార్యకర్తలు తమకు ఉన్నారని చెప్పారు అరుణ్ సింగ్.
కాంగ్రెస్ పార్టీ మూడు వర్గాలుగా చీలి పోయిందన్నారు. ఒకరు సిద్దరామయ్య మరొకరు డీకే శివకుమార్ ఇంకొకరు మల్లికార్జున్ ఖర్గే అని ఎద్దేవా చేశారు.
Also Read : నేతలు వీడినా కార్యకర్తలు పార్టీ వెంటే