ఇంకా కొన్ని గంటల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 10న 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పోలింగ్ జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మొత్తం 2,516 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా ఈసారి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తో పాటు హెచ్ డీ దేవగౌడ సారథ్యంలోని జనతా దళ్ ఎస్ పార్టీల మధ్యే పోటీ నెలకొంది. పవర్ లోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 134 సీట్లకు పైగా రావాలి.
బీజేపీ మరోసారి పవర్ లోకి వస్తానని ధీమాతో ఉండగా కాంగ్రెస్ పార్టీ 140 సీట్లకు పైగా తమకు వస్తాయని అంటోంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందంటూ పేర్కొన్నాయి. రెండు ఛానల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గితే ఒక ఛానల్ మాత్రం బీజేపీ వైపు టిక్ కొట్టింది. 7 ఛానళ్లు, సర్వే సంస్థలు మాత్రం హంగ్ తప్పనిసరి అని జేడీఎస్ కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నాయి. దీంతో జేడీఎస్ చీఫ్ , మాజీ సీఎం కుమార స్వామి అందుబాటులో లేకుండా పోయారు.
కాగా ప్రస్తుత ఫలితాల సరళిని చూస్తే తాము కీలకంగా మారనున్నామని కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ చర్చలు జరుపుతోందంటూ జేడీఎస్ ప్రకటించింది.
