PM House Gherao : ఆగస్టు 5న పీఎం ఇల్లు ముట్టడి – కాంగ్రెస్
దేశంలో నిత్యావసర ధరల పెంపుపై
PM House Gherao : కాంగ్రెస్ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనను గాలికి వదిలి వేశారంటూ ఆరోపించింది. ఓ వైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పట్టించు కోవడం లేదంటూ మండిపడింది.
ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. వచ్చే ఆగస్టు 5న నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపింది.
ప్రధాన మంత్రి ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించింది. ఆరోజు దేశం నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తరలి వస్తారని తెలిపింది. పార్టీ ప్రధాన ఎజెండా ధరల పెరుగదల, అగ్నిపథ్ స్కీం రద్దు చేయాలని, కోట్లాది జాబ్స్ ను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనకు పిలుపు ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
అంతే కాకుండా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ నుండి రాష్ట్రపతి భవన్ కు లాంగ్ మార్చ్ చేపడతామని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో పీఎం ఇంటిని ముట్టడిస్తామని(PM House Gherao) పేర్కొంది.
ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు పాల్గొంటారని వెల్లడించింది. కాగా ఈనెల 18 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
ఇప్పటి వరకు నిత్యావసర వస్తువుల ధరలపై చర్చించేందుకు కేంద్ర సర్కార్ ఒప్పు కోలేదని ఆరోపించింది పార్టీ. అందుకే నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొంది.
ప్రతి రోజూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కేంద్ర సర్కార్ పై ప్రధానంగా ప్రధానిపై నిప్పులు చెరుగతూ వస్తున్నారు.
Also Read : అక్రమార్కుల నుంచి 2,828 ఎకరాలు స్వాధీనం