Congress Chief Poll : రాజస్థాన్ బాటలో చత్తీస్ గఢ్ కాంగ్రెస్
రాహుల్ గాంధీ చీఫ్ కావాలంటూ తీర్మానం
Congress Chief Poll : కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలకు (Congress Chief Poll) సంబంధించి తేదీ దగ్గర పడుతోంది. వచ్చే అక్టోబర్ 17న కాంగ్రెస్ చీఫ్ కోసం ఎన్నిక జరగనుంది. ఇప్పటికే 9,000 మందితో కూడిన జాబితాను డిక్లేర్ చేసింది.
ఎవరు పార్టీ అధ్యక్షుడు అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గాంధీ వర్సెస్ నాన్ గాంధీ నేతల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉండనుందని సమాచారం.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండాలన్న బలమైన వాదన పెరుగుతూ వస్తోంది. ఇవాళ రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ గాంధీకి మద్దతుగా ఆ రాష్ట్ర పార్టీ తీర్మానం చేసింది.
దీనికి తోడు చత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటను ఎంచుకుంది. తమకు కూడా రాహుల్ గాంధీ నాయకుడు కావాలంటూ తీర్మానం చేసింది.
దీంతో రోజు రోజుకు దేశ వ్యాప్తంగా రాహుల్ కు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఇదే తరణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ హోం శాఖ మంత్రి పి. చిదంబరం జాతీయ మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ చీఫ్ గా ఉన్నా లేక పోయినా ఆయనకు కీలకమైన స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. ఆ పదవి ఎక్కడికీ పోదన్నారు. ఇదిలా ఉండగా చివరి నిమిషంలో రాహుల్ గాంధీ తన మనసు మార్చుకుంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు పి. చిదంబరం.
ఇదిలా ఉండగా 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్రకు శ్రీకారం చుట్టారు రాహుల్ గాంధీ. ఈ యాత్ర తమిళనాడును పూర్తి చేసుకుని కేరళలో కొనసాగుతోంది.
Also Read : కేరళ రైలు ప్రతిపాదనలు తిరస్కరణ