Congress Chief Poll : కాంగ్రెస్ లో ఎన్నికల కోలాహలం
మల్లికార్జున్ ఖర్గే వర్సెస్ శశి థరూర్
Congress Chief Poll : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికల(Congress Chief Poll) కోలాహలం చోటు చేసుకుంది. ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ ఎన్నికల బరిలో మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ శశి థరూర్ మధ్యే ఉండనుందని ప్రకటించారు. దీంతొ ఖర్గే, థరూర్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
ఇద్దరూ తమ తమ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశారు. థరూర్ మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి ప్రారంభించారు. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. పార్టీ పరంగా మొత్తం 9,000 మంది సభ్యులు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఎన్నిక తేదీ దగ్గర పడుతుండడంతో ఎవరికి వారే తమకు తోచిన రీతిలో ప్రచారం చేయడంలో మునిగి పోయారు.
సోనియా గాంధీ ఆశీస్సులు పోటీలో ఉన్న ఖర్గే, థరూర్ కు ఉన్నాయని ఇద్దరూ ప్రకటించడం విశేషం. చివరి దాకా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , కమల్ నాథ్ , దిగ్విజయ్ సింగ్ పేర్లు వినిపించినా చివరకు ఖర్గేను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈనెల 19న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు ప్రిసైడింగ్ ఆఫీసర్. శశి థరూర్ కు కార్తీ చిదంబరం మద్దతుదారుగా ఉన్నారు.
ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. థింక్ థరూర్ థింక్ టుమారో అని హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. నా సహచర అభ్యర్థికి మద్దతు పలకమని కోరారు. ఇదిలా ఉండగా ఖర్గేతో తన పోటీ యుద్దం కాదని స్పష్టం చేశారు ఎంపీ శశి థరూర్(Shashi Tharoor). పార్టీ పట్ల సంతృప్తిగా ఉన్న వారు ఖర్గేను ఎన్ను కోవాలని కానీ మార్పు కావాలని కోరుకునే వారు తనను ఎన్నుకోవాలని స్పష్టం చేశారు ఎంపీ.
Also Read : గాంధీని చంపిన సిద్ధాంతంతో యుద్ధం – రాహుల్