Congress Chief Poll : కాంగ్రెస్ బాస్ నువ్వా నేనా
మల్లికార్జున్ ఖర్గే వర్సెస్ థరూర్
Congress Chief Poll : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నిక జరగనుంది. ఈ తరుణంలో సెప్టెంబర్ 30తో నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసింది. ఇక సీనియర్ నాయకుడు కేఎన్ త్రిపాఠి నామినేషన్ రద్దు కావడంతో ఇక చీఫ్ పదవికి ఇద్దరే బరిలో మిగిలారు. ఒకరు రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే కాగా మరొకరు తిరుగుబాటు వర్గానికి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఉన్నారు.
నిన్నటి దాకా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , మాజీ సీఎంలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ చివరకు పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ అనూహ్యంగా కన్నడ ప్రాంతానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు ఓకే చెప్పింది. దీంతో నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపిన డిగ్గీ రాజా మేడం నిర్ణయంతో వెనక్కి తగ్గారు.
ఇక అక్టోబర్ 17న ఎన్నికకు సంబంధించి పోలింగ్(Congress Chief Poll) జరగనుంది. 19న ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం పార్టీలో ఓటు వేసే సభ్యుల సంఖ్య 9,000 మంది ఉన్నారు. ఇక మల్లికార్జున్ ఖర్గేకు సోనియా గాంధీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఆయనకు అదనపు బలం. కాగా శశి థరూర్ మాత్రం ఒంటరి పోరాటం చేయక తప్పదు. ఆయన శనివారం నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి రెడీ అయ్యారు. ఈ మేరకు తనను గెలిపిస్తే పార్టీలో హై కమాండ్ కల్చర్ ను తీసి వేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా మాజీ కేంద్ర మంత్రి కేఎన్ త్రిపాఠి వేసిన నామినేషన్ ను తిరస్కరించినట్లు వెల్లడించారు ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ.
Also Read : ఎన్నికల ప్రచారంలో శశి థరూర్ బిజీ