Congress Chintan Shivir : బ‌ల‌హీన వ‌ర్గాల‌కు 50 శాతం కోటా

న‌వ సంక‌ల్ప్ చింత‌న్ శివిర్ లో కాంగ్రెస్

Congress Chintan Shivir : రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ బ‌హుజ‌నుల జ‌పం చేస్తోంది. ఈ మేర‌కు అన్ని పోస్టుల‌లో 50 శాతం వారికే ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో న‌వ సంక‌ల్ప్ చింత‌న్ శివిర్(Congress Chintan Shivir) జ‌రుగుతోంది.

ఇవాళ రెండో రోజు. కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. షెడ్యూల్డు కులాలు (ఎస్సీలు) షెడ్యూల్డు తెగ‌లు (ఎస్టీలు) ఇత‌ర వెనుక‌బ‌డిన త‌ర‌గతులు (ఓబీసీలు) , మైనార్టీల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌నుంది.

అన్ని స్థాయిలలో ఇప్పుడున్న దాని కంటే 50 శాతం పెంచాల‌ని యోచిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ రోజు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. పార్టీ నాయ‌కుడు కొప్పుల రాజు దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేశారు.

సామాజిక న్యాయం, సాధికార‌త కోసం పార్టీలో సంస్థాగ‌త సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ పెడ‌తాయ‌ని తెలిపారు. ప్యానెల్ క్లియ‌ర్ చేసిన రిజ‌ర్వేష‌న్ ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌క‌టించారు.

ఆదివారం జ‌రిగే కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యుసీ) స‌మావేశంలో దీనికి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ(Congress Chintan Shivir) అధ్య‌క్షుడికి స‌హాయం చేసేందుకు సామాజిక న్యాయ స‌ల‌హా మండ‌లిని ఏర్పాటు చేయ‌డంపై కూడా పార్టీ చ‌ర్చింద‌న్నారు.

అది స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించి సిఫార‌సులు చేస్తుంద‌న్నారు. బ‌లహీన వ‌ర్గాల కోసం ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక‌సారి కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ప్ర‌త్యేక స‌మావేశాన్ని పిలుస్తుంద‌న్నారు.

అంతే కాకుండా జాతీయ విధాన స్థాయిలో కుల ఆధారిత జ‌నాభా గ‌ణ‌న చేప‌ట్టాల‌ని తాము కోరుకుంటున్నామ‌ని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల‌కు ప్రైవేట్ రంగంలో కూడా రిజ‌ర్వేష‌న్లు ఉండాల‌ని, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులో కూడా అని పేర్కొన్నారు.

Also Read : త్రిపుర‌లో రాబోయే కాలం మాదే

Leave A Reply

Your Email Id will not be published!