Congress Chintan Shivir : పార్ల‌మెంట‌రీ బోర్డు పున‌రుద్ద‌రిస్తారా

డిమాండ్ చేస్తున్న అస‌మ్మ‌తివాదులు

Congress Chintan Shivir : సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కీల‌క నిర్ణ‌యాలు తీసుకోబోతోంది. రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో న‌వ్ సంక‌ల్ప్ చింత‌న్ శివిర్(Congress Chintan Shivir) ను ఏర్పాటు చేసింది. 13న ప్రారంభ‌మైంది. మూడు రోజుల పాటు నిర్వ‌హిస్తున్నారు.

ఆఖ‌రి రోజు. ఇక పార్టీ ప‌రంగా చూస్తే గ‌త కొంత కాలం నుంచి అస‌మ్మ‌తివాదుల స్వ‌రం మ‌రింత పెరిగింది. ప్ర‌ధానంగా వారి డిమాండ్ గాంధీ ఫ్యామిలీ లేకుండా పార్టీని న‌డిపించాల‌ని. ఇత‌రుల‌కు పార్టీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని కోరుతూ వ‌స్తున్నారు.

జీ23 మీటింగ్ చేప‌ట్టారు. ఈ అస‌మ్మ‌తి గ్రూప్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తోంది కేంద్ర మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు గులాం న‌బీ ఆజాద్. ఆయ‌న‌ను పిలిచి మాట్లాడి స‌ద్దుమ‌ణిగేలా చేశారు ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ.

ప‌లు కీల‌క తీర్మానాలు చేశారు పార్టీ బైట‌క్ లో . తాజాగా అస‌మ్మ‌తి నేత‌ల ప్ర‌ధాన డిమాండ్ పార్టీకి సంబంధించి పార్ల‌మెంట‌రీ బోర్డును ఏర్పాటు చేయాల‌ని. ఇప్ప‌టికే ఇది ఉంది. కానీ దాని ఊసే లేకుండా పోయింది.

దీనిని తిరిగి పున‌రుద్ద‌రించాల‌ని కోరుతూ వ‌స్తోంది గాంధీ ఫ్యామిలీ వ్య‌తిరేక గ్రూప్. కాగా కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) ప‌రిశీలించాల్సిన జాబితాలో చేర్చింది ఈ అంశాన్ని. దానిని ఆమోదించే అవ‌కాశాలు లేవ‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

ఎందుకంటే పార్టీ అధ్య‌క్షురాలి అధికారాల‌ను త‌గ్గించేలా ఉంద‌ని భావించ‌డంతో అందుకు ఒప్పుకోవ‌డం లేన‌ట్లు స‌మాచారం. పీవీ న‌ర‌సింహారావు పీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక పార్ల‌మెంట‌రీ బోర్డును నిలిపి వేశారు.

Also Read : మోదీ ప్ర‌భుత్వం దేశానికి ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!