Congress CPI CPM : కాంగ్రెస్ దోస్తానా లెఫ్ట్ కు న‌జ‌రానా

సీపీఐ, సీపీఎం పార్టీల‌కు 4 సీట్లు

Congress CPI CPM : హైద‌రాబాద్ – నిన్న‌టి దాకా దూరంగా ఉన్న వామ‌ప‌క్ష పార్టీల‌కు పంట పండింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలంగాణ‌, రాజ‌స్థాన్ , మ‌ధ్య‌ప్ర‌దేశ్ , మిజోరాం, ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల షెడ్యూల్ ఖ‌రారు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులను ఎంపిక చేసే ప‌నిలో ప‌డింది. ఈ మేర‌కు ఇప్ప‌టికే స్క్రినింగ్ క‌మిటీల‌ను ఎంపిక చేసింది.

Congress CPI CPM Alliance

ఇందులో భాగంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ ను ఢీకొనేందుకు కాంగ్రెస్(Congress) పార్టీ దేశ వ్యాప్తంగా భావ సారూప్య‌త క‌లిగిన 28 పార్టీల‌తో క‌లిసి ఇండియా కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. ఇందులో వామ‌ప‌క్ష పార్టీలు సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా ఉన్నాయి.

దీంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వామ‌పక్ష పార్టీల‌కు నాలుగు సీట్ల‌ను ఖ‌రారు చేసింది. ఇందులో భాగంగా సీపీఎం పార్టీకి 2 సీట్లు, సీపీఐకి 2 సీట్లు కేటాయించింది. వాటిలో క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి కొత్త గూడెం, మునుగోడు స్థానాలు ఖ‌రారు చేసింది.

ఇక క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీకి భ‌ద్రాచ‌లం, మిర్యాలగూడ స్థానాల‌ను ఎంపిక చేసింది. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన‌ట్ల‌యింది. నిన్న‌టి దాకా ఆ పార్టీతో క‌లిసి ఉన్నాయి వామ‌ప‌క్షాలు.

Also Read : Congress Seniors : కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు నో ఎంట్రీ

Leave A Reply

Your Email Id will not be published!