PM Modi : కాంగ్రెస్ సిద్దాంతం విభిజించి పాలించడం
ఎన్నికల ప్రచారంలో నిప్పులు చెరిగిన మోదీ
PM Modi : కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించాలని చూస్తోందని ధ్వజమెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). గుజరాత్ విశ్వాసాన్ని ఎలా తిరిగి పొందాలనే దానిపై విచిత్రమైన సలహా కూడా ఇచ్చారు. భారత దేశాన్ని విఛ్చిన్నం చేయాలని అనుకునే అంశాలకు మద్దతు ఇచ్చే వారికి సాయం చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా లేరని నరేంద్ర మోదీ అన్నారు.
సౌరాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలకు నర్మదా జలాలు చేరకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందంటూ ప్రధానమంత్రి ఆరోపించారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో నర్మదా బచావో ఆందోళన కార్యకర్త మేధా పాట్కర్ పాల్గొనడంపై నరేంద్ర మోదీ సోమవారం మరోసారి కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. మరో వైపు రాహుల్ గాంధీ సైతం మోదీపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిపక్ష పార్టీ విభజించు పాలించు అనే వ్యూహంతో గుజరాత్ లో యత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు ప్రధానమంత్రి(PM Modi).
భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భావ్ నగర్ జిల్లాలోని పలితానా పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రసంగించారు. ఒక ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే పార్టీ విధానం వల్ల రాష్ట్రం చాలా నష్ట పోయిందన్నారు.
అందుకే గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి. ఇదిలా ఉండగా గుజరాత్ రాష్ట్రంలో డిసెంబర్ 1, 5 తేదీలలో రెండు విడతలుగా శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read : రాహుల్ యాత్రపై సింధియా సెటైర్