Arvind Kejriwal : గుజరాత్ లో కాంగ్రెస్ పనై పోయింది – కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్..సీఎం షాకింగ్ కామెంట్స్
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గుజరాత్ లో రెండు రోజుల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
ఆ పార్టీకి గత చరిత్ర మాత్రమే ఉందని భవిష్యత్తు లేదన్నారు. ఒకప్పుడు దేశ మంతటా విస్తరించిన కాంగ్రెస్ ప్రస్తుతం తన ఉనికి కోసం పోరాడుతోందన్నారు కేజ్రీవాల్. అహ్మదాబాద్ లోని టౌన్ హాల్ లో పారిశుధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మీడియాతో మాట్లాడారు. తాము ఢిల్లీలో గెలిచాం. ఆ తర్వాత పంజాబ్ లో పాగా వేశాం. గుజరాత్ లో కూడా పవర్ లోకి రాబోతున్నామని జోష్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లో ఆ పార్టీకి చుక్కలు చూపించామన్నారు. ప్రజలు బేషరతుగా తమకే ఓటు వేసి అధికారాన్ని అప్పగించారని చెప్పారు.
పంజాబ్ సీన్ గుజరాత్ లో రిపీట్ కాబోతోందని స్పష్టం చేశారు కేజ్రీవాల్. ఇక గుజరాత్ లో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 27 ఏళ్లయినా ఏం సాధించిందని నిలదీశారు.
ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఆప్ కు అంత సీన్ లేదని చేసిన కాంగ్రెస్(Congress Party) గురించి ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీకి అంత సీన్ లేదని దాని గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ అన్నారు.
అంతే కాదు గుజరాత్ లో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఆప్ మాత్రమే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్.
Also Read : ఆటో డ్రైవర్ ఇంట్లో కేజ్రీవాల్ భోజనం