Congress Flexi : హరీశ్ కు కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీ
మనోడికి ప్రతిపక్షాల్లోనూ ఫాలోయింగ్
Congress Flexi : ఎవరైనా తమ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం సహజం. కానీ విచిత్రం ఏమిటంటే తెలంగాణలో ఇందుకు భిన్నంగా ఉంది. భారత రాష్ట్ర సమితి పార్టీలో మంత్రిగా కొలువు తీరిన తన్నీరు హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో, విపక్షాల నేతలను విస్తు పోయేలా చేయడంలో తనకు తానే సాటి అన్న గుర్తింపు కూడా ఉంది.
Congress Flexi for BRS Minister Viral
ఆ మధ్యన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పట్టున్న కోడంగల్ నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరించాడు. ఛాలెంజ్ చేసి మరీ ఓడించాడు హరీశ్ రావు. అందుకే బీఆర్ఎస్ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ కు అల్లుడైన హరీశ్ రావు(Harish Rao)పై అంత గురి. ఆయన ప్రస్తుతం ఆరోగ్య, ఆర్థిక శాఖలను నిర్వహిస్తున్నారు.
తాజాగా మంత్రి హరీశ్ రావు హాట్ టాపిక్ గా మారారు. కారణం స్వంత పార్టీ వారే కాకుండా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు హరీశ్ కు స్వాగతం పలుకుతూ బ్యానర్లను ఏర్పాటు చేయడం కలకలం రేపింది. దీంతో బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఒక్కటేనన్న భావన ప్రజల్లో కలుగుతోంది. మరో వైపు మంత్రికి ఫ్లెక్సీలు పెడితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఆయన కేబినెట్ హోదా కలిగిన వారు కావడం వల్ల ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటున్నారు.
Also Read : Chandrababu Naidu : తెలంగాణ నెంబర్ 1 కు కారణం నేనే