Congress GHMC : కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ముట్టడి ఉద్రిక్తం
టీపీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన
Congress GHMC : హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కార్యాలయాన్ని శుక్రవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్(Telangana Congress) కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ముట్టడించారు. ఆ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఆందోళన చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు భారీ ఎత్తున తరలి వచ్చారు. రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీపీసీసీ మాజీ చీఫ్ వీ హన్ముంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Congress GHMC Siege
రాష్ట్ర రాజధానిని డల్లాస్ ను చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎక్కుడున్నారంటూ ప్రశ్నించారు. ఒకరు ఫామ్ హౌస్ లో నిద్ర పోతున్నారని, మరొకరు ట్విట్టర్ లో సొల్లు కబుర్లు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఓ వైపు చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ చిత్తడిగా మారిందని వాపోయారు. ఓ వైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్లన్నీ జలమయం అయ్యాయని ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.
ఇంత జరుగుతున్నా సీఎం, కేటీఆర్ స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి లేని పేద కుటుంబాలకు, కార్మికులకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. వరదల్లో మునిగి పోయిన ప్రాంతాలను వెంటనే పునరుద్దరించాలని కోరారు.
Also Read : MLC Kavitha : కవిత పిటిషన్ సుప్రీంకోర్టు స్వీకరణ