Nirmala Sitharaman : కాంగ్రెస్ కు విమ‌ర్శించే హ‌క్కు లేదు

ద్ర‌వ్యోల్బ‌ణం అదుపులోనే ఉంది

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) నిప్పులు చెరిగారు. ఆమె కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ద్ర‌వ్యోల్బ‌ణం అదుపులోనే ఉంద‌ని, దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడే హ‌క్కు కాంగ్రెస్ పార్టీకి లేద‌న్నారు నిర్మలా సీతారామ‌న్. ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నియంత్రించేందుకు మోదీ ప్ర‌భుత్వం శ‌త విధాలుగా య‌త్నిస్తోంద‌ని చెప్పారు. యూపీఏ హ‌యాంలోనే ద్ర‌వ్యోల్బ‌ణం నిరంత‌రం అధికంగా ఉంద‌ని ఆరోపించారు కేంద్ర మంత్రి.

క‌ర్ణాట‌క‌లో ఇవాళ పోలింగ్ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా నిర్మ‌లా సీతారామ‌న్ త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ తిరిగి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ పాల‌న ప‌ట్ల పూర్తి నమ్మ‌కంతో ఉన్నార‌ని చెప్పారు. ధ‌ర‌లు త‌గ్గాల‌ని తాను కూడా కోరుకుంటున్న‌ట్లు చెప్పారు కేంద్ర మంత్రి.

ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు రావ‌డం తాను చూడ‌లేద‌న్నారు నిర్మ‌లా సీతారామ‌న్‌. సీనియ‌ర్లు, యువ‌కులు, మ‌హిళ‌లు భారీ సంఖ్య‌లో ఇక్క‌డికి రావ‌డం , ఓటు వేయ‌డం శుభ సూచ‌క‌మ‌న్నారు. ప్ర‌భుత్వ ప‌నితీరు బాగుంటేనే ఓటు శాతం పెరుగుతుంద‌ని ఇది త‌మ గెలుపున‌కు సంకేత‌మ‌ని చెప్పారు కేంద్ర మంత్రి(Nirmala Sitharaman).

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా క‌ర్ణాట‌క రాష్ట్రానికి భారీగా నిధులు మంజూరు చేశామ‌న్నారు కేంద్ర మంత్రి. మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌కు ప్ర‌యారిటీ ఇచ్చామ‌న్నారు. ఇది ఒక ర‌కంగా న‌గ‌రం అభివృద్ది చెందేందుకు దోహ‌దం చేస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Also Read : స్టిక్క‌ర్ల‌పై శ్ర‌ద్ధ నీళ్లివ్వ‌డంలో అశ్ర‌ద్ద‌

Leave A Reply

Your Email Id will not be published!