BJP Tarun Chugh : ఐసీయూలో కాంగ్రెస్ – తరుణ్ చుగ్
డిప్రెషన్ లో సీఎం కేసీఆర్
BJP Tarun Chugh : తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్(BJP Tarun Chug) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ పవర్ లోకి రాదన్నారు.
ఆయా పార్టీలకు 60కి మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. వచ్చేది సంపూర్ణ ఆధిక్యంతో కూడిన సర్కార్ రాదని జోష్యం చెప్పారు. కేవలం హంగ్ ప్రభుత్వం ఏర్పడుతందని అన్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ కాంగ్రెస్ పార్టీ , భారత రాష్ట్ర సమితి ఒక్కటేనంటూ ఎద్దేవా చేశారు.
ప్రజలను మభ్య పెట్టేందుకు రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయంటూ ఆరోపించారు. తాము ప్రజల తరపున సమస్యలను ప్రస్తావిస్తున్నామని చెప్పారు. మంగళవారం తరుణ్ చుగ్(BJP Tarun Chugh) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉందన్నారు. దానికి శ్వాస కరువైందని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగడం ఖాయమన్నారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బి టీమ్ అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కలలు కనేదని ..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ, అవినీతి, రైతు, నిరుద్యోగ వ్యతిరేక పాలనని తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తాము పవర్ లోకి రావడం ఖాయమన్నారు.
Also Read : భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి