అస్సాం : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీపై. శనివారం ఆయన అస్సాం రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో నిప్పులు చెరిగారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. ఈ సమయంలో అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీ లేని భయాందోళనలు రేపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మోదీ. యుద్ధ సంక్షోభం మధ్య కాంగ్రెస్ భయాందోళనలు వ్యాపింప జేస్తోందని ఆరోపించారు . ప్రపంచ సంఘర్షణలు , ఆర్థిక అంతరాయాల ప్రభావం నుండి భారత పౌరులను రక్షించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని చెప్పారు. అస్సాంలోని సిల్చార్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేయడం ఆనందంగా ఉందన్నారు.
భారత జాతీయ కాంగ్రెస్ ప్రపంచ శక్తుల కీలుబొమ్మ వ్యవహరిస్తోందని, భారతదేశం వేగవంతమైన అభివృద్ధిని అంగీకరించ లేక పోతున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల మధ్య ప్రతిపక్ష పార్టీ దేశంలో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని , మన దేశ పౌరులు సాధ్యమైనంత తక్కువ కష్టాలను ఎదుర్కొనేలా చూసుకోవడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేశారు మోదీ. ఈ యుద్ధం ప్రభావాన్ని దేశ పౌరులపై తగ్గించడమే మా లక్ష్యం నొక్కి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి అన్ని రాజకీయ పార్టీల నుండి బాధ్యతా యుతమైన ప్రవర్తన అవసరమని, కానీ జాతీయ ప్రయోజనాల కోసం వ్యవహరించడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు.
