Jairam Ramesh : బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటే
మిగతా పార్టీలు కలిసి రావాల్సిందే
Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ చార్జ జైరాం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో భారతీయ జనతా పార్టీకి కీలకమైన ప్రత్యామ్నాయం ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ దరిదాపుల్లో లేదన్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో కొనసాగుతోంది.
ఈ సందర్బంగా జైరాం రమేష్(Jairam Ramesh) మీడియాతో మాట్లాడారు. జాతీయీ స్థాయిలో బీజేపీకి ఏది గట్టిగా నిలబడుతుందనే చర్చకు వచ్చిన సమయంలో తమ పార్టీ తప్పా ఇంకేదీ లేదన్నారు జైరాం రమేష్. కానీ కొందరు కలలు కంటున్నారని వారికి అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సీఎం కేసీఆర్ ను దృష్టి పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతుంది.
ఎవరైనా పార్టీలు పెట్టేందుకు లేదా ఆలోచనలు పంచుకునేందుకు అర్హులు. వారిని కాదనం. కానీ సుదీర్ఘమైన పోరాట చరిత్ర కలిగిన ఏకైక పార్టీ తమదన్నారు. త్యాగాలు చేసిన కుటుంబ చరిత్ర తమకు ఉందని కానీ ఇతర పార్టీలకు ఆ చరిత్ర మచ్చుకైనా ఉందా అని జైరాం రమేష్ ప్రశ్నించారు.
ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రధానంగా బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతోందన్నారు. కానీ తెలంగాణలో అలాంటి వాతావరణం లేకుండా పోయిందన్నారు. ఇక్కడ రాచరిక పాలన సాగుతోందన్నారు. పాలనను కంట్రోల్ చేయలేని వారు దేశాన్ని ఎలా కంట్రోల్ చేస్తారంటూ ప్రశ్నించారు జైరాం రమేష్.
ఎంఐఎంతో అపవిత్ర పొత్తు పెట్టుకున్నది ఎవరు అని నిలదీశారు.
Also Read : బీజేపీ..టీఆర్ఎస్ రెండూ ఒక్కటే – రాహుల్