Kiren Rijiju : న్యాయ వ్యవస్థను బెదిరిస్తున్న కాంగ్రెస్
నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి రిజిజు
Kiren Rijiju Congress : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన సోమవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదన్న ఒకే ఒక్క కారణంతో తమ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.
వారు పదే పదే న్యాయ వ్యవస్థను చులకన చేసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు కిరెన్ రిజిజు(Kiren Rijiju Congress). అంతే కాదు వారికి ఈ న్యాయ వ్యవస్థ పట్ల కానీ దేశం పట్ల కానీ ఏ మాత్రం గౌరవ భావం లేదని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ అత్యుత్తమమైనది. దానిని సైతం బెదిరించేందుకు వెనుకాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కిరెన్ రిజిజు.
దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. కోర్టు ఎవరినైనా దోషిగా నిర్దారించినట్లయితే దానికి ఎవరైనా సరే కట్టుబడి ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ ఆయన పరివారం వ్యక్తిగతంగా దిగజారుడు కామెంట్స్ చేస్తూ వచ్చారని , అందుకు గాను పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు జైలు శిక్ష విధించిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ దేశం కంటే కుటుంబాన్ని ఉన్నతంగా పరిగణిస్తుందని కానీ తమ పార్టీ అలా కాదని పేర్కొన్నారు. తాము ఎవరి పట్ల ద్వేష భావంతో లేమన్నారు కిరెన్ రిజిజు(Kiren Rijiju). వ్యవస్థల పట్ల గౌరవ భావం లేకుండా మాట్లాడుతున్నది ఎవరో కోట్లాది మంది దేశ ప్రజలకు తెలుసన్నారు. ఏదైనా ఉంటే ఎన్నికల క్షేత్రంలో తేల్చు కోవాలని కానీ తాము పవర్ లో లేమని ఇతరులను నిందిస్తూ పోతామంటే ఎలా అని ప్రశ్నించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి.
Also Read : ధర్మం గెలుస్తుంది నీతి నిలుస్తుంది