Congress Join : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరిత గులాబీకి గుడ్ బై చెప్పారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి సమక్షంలో పార్టీలో చేరారు. వీరంతా ఢిల్లీలోని ఖర్గే(Mallikarjun Kharge) నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Congress Join To
సరిత తిరుపతితో పాటు మాజీ మార్కెట్ చైర్మన్ బండ్ల లక్ష్మిదేవి చంద్రశేఖర్ రెడ్డి , ఆరెంజ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే.
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పట్ల ప్రజలు విసిగి పోయారని, నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికే కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని , త్వరలో మరికొందరు నేతలు వలస బాట తప్పదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని , ఎమ్మెల్యేలను ఎవరూ నమ్మడం లేదన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.
Also Read : FEFSI Rules : ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కొత్త రూల్స్