Congress Lead : కాంగ్రెస్ ముందంజ బీఆర్ఎస్ వెనుకంజ
మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ కు హస్తం
Congress Lead : తెలంగాణ – రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ ను ప్రతిఫలిస్తున్నాయి. రౌండ్ రౌండ్ కు లెక్కలు మారుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 70కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కనీసం 60 సీట్లు రావాల్సిన అవసరం ఉంది. విచిత్రం ఏమిటంటే నియంత పాలన సాగిస్తూ వచ్చిన బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.
Congress Lead Viral in Telangana
ఇక హంగ్ వస్తుందని తాము నిర్ణయాత్మక పాత్రను పోషిస్తామని బీరాలు పలుకుతూ వచ్చిన బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కనీసం 20 సీట్లకు పైగా వస్తుందని అంచనా వేశారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవాకు కమలం వాడి పోయేలా కనిపిస్తోంది. ప్రజలు పూర్తిగా ఏకపక్షంగా కాంగ్రెస్(Congress) పార్టీకి లీడ్ ఇచ్చేలా తమ తీర్పు ఇచ్చారు.
ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి 73 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా భారత రాష్ట్ర సమితి పార్టీకి 34 సీట్లలో స్వల్ప మెజారిటీలో ఉంది. ఇక చక్రం తిప్పాలని అనుకున్న బీజేపీ 7 సీట్లలో ఎంఐఎం 4 సీట్లలో ఆధిక్యంలో ఉంటోంది. విచిత్రం ఏమిటంటే ఎంఐఎం తన పూర్వ సీట్లను కోల్పోతుండడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Revanth Reddy : రెండు చోట్ల రేవంత్ రెడ్డి లీడ్