Congress MPs : హైదరాబాద్ – కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ఇటు లోక్ సభలో అటు రాజ్యసభలో అనుకూలంగా సభ్యులు ఓటు వేశారు. కానీ కొందరు ఎంపీలు మాత్రం దూరంగా ఉన్నారు.
మరికొందరు ఎంపీలు కావాలని ఓటు వేయలేదని , తాము వ్యతిరేకం అంటూ ప్రకటించారు. వారిలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారెవరో కాదు ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మరో ఎంపీ ఇంతియాజ్ జలీల్.
Congress MPs Viral
ఇదిలా ఉండగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మొదట శ్రీకారం చుట్టింది ఆనాటి కాంగ్రెస్(Congress) సంకీర్ణ సర్కార్. తాజాగా కూడా ఏఐసీసీ మాజీ చీఫ్ ,సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ సైతం మద్దతు తెలిపారు. తమ పార్టీ కూడా సంపూర్ణ సహకారం అందజేస్తుందని ప్రకటించారు. ఈ మేరకు బిల్లు ఆమోదం పొందేలా చూశారు.
కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం మహిళా బిల్లుకు దూరంగా ఉన్నారు. తాజాగా వీరిద్దరిపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై తీవ్ర దుమారం చెలరేగడంతో తాము ఓటు వేయలేదంటూ ఒప్పుకున్నారు ఈ ముగ్గురు ఎంపీలు.
Also Read : Tirumala Devotees : తిరుమలలో భక్తుల రద్దీ