Congress Suspends : జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు
నగదుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు
Congress Suspends : పశ్చిమ బెంగాల్ లో భారీ ఎత్తున నోట్ల కట్టలతో పట్టు బడ్డారు జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ(Congress Suspends) కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు. ఈ నగదును జార్ఖండ్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకే భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ మేరకు దీనికి ఆ పార్టీనే బాధ్యత వహించాలని పేర్కొంది. విచిత్రం ఏమిటంటే నగదుతో బయలు దేరిన ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో పోలీసులకు పట్టుబడ్డారు.
దీంతో తమ పార్టీకి చెందిన ఆ ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే విషయాన్ని ఆదివారం మీడియాతో వెల్లడించింది.
మరో వైపు కాంగ్రెస్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని అవినీతికి జార్ఖండ్ ప్రభుత్వమే కారణమని ఆరోపించింది భారతీయ జనతా పార్టీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రతి ఒక్కరికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని తెలిపింది. రాబోయే రోజుల్లో ఏ ప్రజా ప్రతినిధి అయినా , పార్టీ ఆఫీస్ బేరర్ అయినా , లేదా ఏ కార్యకర్త అయినా , ఎవరితో సంబంధం కలిగి ఉన్నారో వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.
ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే ఆదివారం ప్రకటించారు. ఆయన జార్ఖండ్ రాష్ట్ర ఇన్ చార్జిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
పార్టీ నుండి సస్పెండ్ చేసిన వారిలో జమతారా నుండి ఇర్ఫాన్ అన్సారీ, ఖిజ్రీ నుండి రాజేష్ కచ్చప్ , కొలెబిరా నుండి నమన్ బిక్సల్ కొంగరీ ఉన్నారు.
Also Read : బీజేపీ ఎంపీల తీరుపై మహూవా ఫైర్