Palvai Sravanthi : పాల్వాయి స్రవంతికి బిగ్ షాక్
జంప్ అయిన కోమటిరెడ్డికి టికెట్
Palvai Sravanthi : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితా ప్రకటన కలకలం రేపుతోంది. 45 మంది తో కూడిన లిస్టును ఖరారు చేసింది ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ. ఇందులో 21 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు.
Palvai Sravanthi Serious
ఇక చివరి దాకా టికెట్ ను ఆశిస్తూ వచ్చారు దివంగత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి. ఇటీవల మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తానంటూ బహిరంగంగానే ప్రకటించారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి.
తీరా తనకు టికెట్ వస్తుందని భావించారు పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi). ఊహించని రీతిలో కాంగ్రెస్ కు రిజైన్ చేసి బీజేపీలోకి జంప్ అయి తిరిగి హస్తం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ కేటాయించడం విస్తు పోయేలా చేసింది.
ఆయన పార్టీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. మొత్తంగా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు సీట్లు కేటాయించక పోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
మరో వైపు టికెట్ కేటాయించక పోవడంపై అసంతృప్తి నెలకొంది. బల్మూర్ వెంకట్ తో పాటు విష్ణు వర్దన్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ తో అజాహరుద్దీన్ కు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు విష్ణు.
Also Read : Revanth Reddy : కేసీఆర్ పై రేవంత్ పోటీకి సై