Jagadish Shettar : జగదీశ్ శెట్టర్ కు ఎమ్మెల్సీ ఛాన్స్
ధ్రువీకరించిన కాంగ్రెస్ పార్టీ
Jagadish Shettar : కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఖుష్ కబర్ చెప్పింది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఆయనకు అధికారిక కోటాలో ఎమ్మెల్సీ కేటాయించనున్నట్లు ప్రకటించింది . దీనిని పార్టీ ధ్రువీకరించింది కూడా. దీంతో ఆయన అభిమానుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.
జగదీశ్ శెట్టర్(Jagadish Shettar) కు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. ఆయన మూలాలు రాష్ట్రీయ స్వయం సంఘ్ నుంచి ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఈ ఏడాది కన్నడ నాట జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఊహించని రీతిలో అప్పటి భారతీయ జనతా పార్టీ సర్కార్ అవమానించింది. ఆయనకు టికెట్ కు ఇవ్వకుండా షాక్ ఇచ్చింది.
దీంతో కొన్నేళ్లుగా బీజేపీతో ఉన్న అనుబంధానికి కటీఫ్ చెప్పారు మాజీ సీఎం జగదీశ్ శెట్టర్. ఆ వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. ఆపై ఎమ్మెల్యే టికెట్ పొందారు. కానీ ఆయన కొద్దిపాటి తేడాతో ఓటమి పాలయ్యారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆయనకు రాష్ట్రంలో కేబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా ఛాన్స్ ఇస్తారని భావించారు. అంతకంటే ముందు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగదీశ్ శెట్టర్ కు ప్రయారిటీ ఇచ్చారు.
Also Read : Sajjanar MD TSRTC : మహిళలు, సీనియర్లకు ఖుష్ కబర్