Prithviraj Chauhan : కాంగ్రెస్ పార్టీకి ద‌మ్మున్న లీడ‌ర్ కావాలి

అస‌మ్మ‌తి నేత పృథ్వీరాజ్ చౌహాన్

Prithviraj Chauhan :  ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన గులాం నబీ ఆజాద్ గుడ్ బై చెప్ప‌డంతో ప్ర‌స్తుతం 134 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో క‌ల‌కలం రేగుతోంది. సీబ్ల్యూసీ మీటింగ్ జ‌రిగింది. అక్టోబ‌ర్ 17న పార్టీ కొత్త అధ్య‌క్షుడి ఎన్నిక కోసం ముహూర్తం ఖరారు చేశారు.

ఎన్నిక ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా జ‌ర‌గ‌నుంది. అదే నెల 19న ఫ‌లితం ప్ర‌క‌టిస్తారు. ఒక వ‌ర్గం రాహుల్ గాంధీ చీఫ్ కావాల‌ని కోరుకుతుండ‌గా మ‌రో అస‌మ్మ‌తి వ‌ర్గం మాత్రం గాంధీయేత‌ర వ్య‌క్తిని పార్టీ అధ్య‌క్షుడిగా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది.

ఈ త‌రుణంలో జి23 టీంలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్న , మ‌హారాష్ట్ర మాజీ సీఎం పృథ్విరాజ్ చౌహాన్ (Prithviraj Chauhan) షాకింగ్ కామెంట్స్ చేశాడు. తోలుబొమ్మ లాంటి లీడ‌ర్లు త‌మ‌కు అక్క‌ర్లేద‌ని ద‌మ్మున్న వాళ్లు కావాల‌ని పేర్కొన్నారు చౌహాన్.

పార్టీని కాపాడేందుకు అత్య‌వ‌స‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాగే ఉంటే పార్టీ మ‌నుగ‌డ సాగించ‌డం క‌ష్ట‌మ‌ని హెచ్చ‌రించాడు.

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ తో స‌హా అన్ని ప‌ద‌వుల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వెనుక సీటులో కూర్చుని డ్రైవింగ్ చేయ‌లేమంటూ ఘాటుగా స్పందించారు.

రాహుల్ గాంధీ అధ్య‌క్షుడిగా ఉండ కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంటే త‌మ‌కు అభ్యంత‌రం లేద‌న్నారు. కానీ ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు చౌహాన్.

ఇదే స‌మ‌యంలో సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన గులాం న‌బీ ఆజాద్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఒక ర‌కంగా పార్టీకి తీర‌ని న‌ష్టం అని పేర్కొన్నారు.

Also Read : వాట్ ఏ విక్ట‌రీ – రాహుల్..ప్రియాంక‌

Leave A Reply

Your Email Id will not be published!