Congress Party Slams : ఆ మూడు పార్టీలు ఒక్క‌టే

స్పష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ

Congress Party Slams : హైద‌రాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ , ఎంఐఎం , భార‌తీయ జ‌న‌తా పార్టీల‌న్నీ ఒక్క‌టేన‌ని ఆరోపించింది. పైకి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకుంటూ నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకాన్ని మోసం చేస్తున్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Congress Party Slams BJP,BRS,MIM

దేశంలో కొలువు తీరిన మోదీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ దేశాన్ని నిట్ట నిలువునా ముంచేసింద‌ని ఆరోపించింది. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా బ‌డా బాబుల‌కు, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, వ్యాపారుల‌కు అందినంత మేర దోచి పెడుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది కాంగ్రెస్ పార్టీ(Congress Party).

ఇక తెలంగాణ రాష్ట్రంలో క‌ల్వ‌కుంట్ల కుటుంబం కాన్ దాన్ గా మారి పోయింద‌ని, ఇప్ప‌టికే ల‌క్ష కోట్ల రూపాయ‌ల అవినీతికి పాల్ప‌డింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో విడి పోయిన స‌మ‌యంలో మిగులు బ‌డ్జెట్ తో ఉండేద‌ని కానీ ఇవాళ ప్రాజెక్టుల పేరుతో అందినంత మేర దోచుకుంద‌ని మండి ప‌డింది.

ఇక ఎంఐఎం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొంది. ఎవ‌రు అధికారంలో ఉంటే వారికి వ‌త్తాసు ప‌ల‌క‌డం రివాజుగా మారింద‌ని స్ప‌ష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ.

Also Read : AP CM YS Jagan : తీవ్ర వాదంపై ఉక్కు పాదం

Leave A Reply

Your Email Id will not be published!