Congress Slams : అదానీ జ‌పం ఇంకెంత కాలం – కాంగ్రెస్

ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోని ప్ర‌ధాన‌మంత్రి

Congress Slams : కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ప‌దే ప‌దే టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. గ‌త కొంత కాలం నుంచీ మోదీ హ‌యాంలో వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ కంపెనీల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారంటూ ఆరోపించింది. ఇప్ప‌టికే దేశంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతుంటే ప్ర‌ధాని ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొంది కాంగ్రెస్ పార్టీ. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఈ సంద‌ర్భంగా అరుదైన ఫోటోను పంచుకుంది.

ఎక్క‌డైనా దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న వ్య‌క్తికి ఎవ‌రైనా గౌర‌వంగా న‌మ‌స్క‌రిస్తారు. కానీ ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ గా ఉంద‌ని ఎద్దేవా చేసింది పార్టీ. ఈ ఫోటోలో న‌రేంద్ర మోదీ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీకి న‌మ‌స్క‌రిస్తున్న ఫోటోను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. ఈ ఒక్క ఫోటో దేశం ఎటుపోతోందో తెలియ చేస్తుంద‌ని కాంగ్రెస్(Congress) పార్టీ స్ప‌ష్టం చేసింది.

ఇప్ప‌టికే దేశంలో ఉన్న వ‌న‌రుల‌ను గంప గుంత‌గా అప్ప‌గించిన ఘ‌న‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి ద‌క్కుతుంద‌ని ఆరోపించింది. ఓ వైపు ద్ర‌వ్యోల్బ‌ణం గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా పెరిగింద‌ని, నిరుద్యోగం తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో స‌మ‌స్య‌లు పేరుకు పోతుంటే మోదీ మాత్రం త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌చారంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారంటూ ఎద్దేవా చేసింది.

Also Read : Bandi Sanjay : ట‌చ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు – బండి

Leave A Reply

Your Email Id will not be published!