Manickam Tagore : రాబోయే ఎన్నిక‌ల్లో హ‌స్తందే హ‌వా

78 సీట్ల‌లో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు

Manickam Tagore : తెలంగాణ‌లో బ‌లంగా విస్త‌రిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్ప‌టికే త‌మ పార్టీకి ఉన్నంత కేడ‌ర్ ఇంకే పార్టీకి లేదు. ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్న టీఆర్ఎస్, ప్ర‌భుత్వ ఆస్తుల‌ను గంప గుత్త‌గా అమ్మ‌కానికి పెట్టిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి అంత సీన్ లేద‌న్నారు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.

గులాబీని ఒడించే స‌త్తా ఒక్క త‌మ పార్టీకి మాత్ర‌మే ఉంద‌న్నారు. పార్టీలో చెల్ల‌ని వారే బీజేపీ లోకి వెళుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ‌కు 80 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉన్నార‌ని 78 సీట్ల‌లో త‌మ గెలుపు ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

42 వేల మంది క్రియాశీల‌క స‌భ్యులు 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ని చేస్తున్నార‌ని చెప్పారు. బీజేపీకి డ‌బుల్ డిజిట్ కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌న్నారు. కొంద‌రు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఒన‌గూరిన న‌ష్టం అంటూ ఏమీ లేద‌న్నారు.

కేసీఆర్ పాల‌న పూర్తిగా రాచ‌రికాన్ని త‌ల‌పింప చేస్తోంది. తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తే యువ‌కులు, రైతులు, మ‌హిళ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు.

ప్ర‌గ‌తి శీల ప్ర‌జాస్వామ్య తెలంగాణ కోసం తాము ప‌ని చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మాణిక్యం ఠాగూర్(Manickam Tagore). మునుగోడులో జ‌రిగే ఉప ఎన్నిక కాంగ్రెస్ టీఆర్ఎస్ మ‌ధ్యే జ‌రుగుతుంద‌న్నారు.

ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన రాజ గోపాల్ రెడ్డి ప‌ట్ల పూర్తి వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ కుటుంబం లాంటిది. క‌ల‌హాలు, అభిప్రాయ భేదాలు స‌ర్వ సాధార‌ణం.

ఏ పార్టీలోని స్వేచ్ఛ త‌మ పార్టీలోనే సాధ్య‌మ‌న్నారు. హైక‌మాండ్ ఆలోచించిన త‌ర్వాతే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఎంపిక చేశామ‌న్నారు.

Also Read : తెలంగాణ కాంగ్రెస్ పై ప్రియాంక ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!