Congress President Poll : ఏఐసీసీ చీఫ్ ఎన్నిక కోసం నోటిఫికేష‌న్

24 నుంచి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభం

Congress President Poll : సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ‌త కొంత కాలం నుంచి వాయిదా ప‌డుతూ వ‌స్తున్న అధ్య క్ష ప‌ద‌వికి(Congress President Poll) మోక్షం ల‌భించింది.

ఈ మేర‌కు అధికారికంగా నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ గా ఉన్న మ‌ధుసూద‌న్ మిస్త్రీ గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఎన్నిక‌కు సంబంధించింది.

వ‌చ్చే నెల అక్టోబ‌ర్ 17న పార్టీ చీఫ్ కోసం ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అదే నెల 19న పార్టీ చీఫ్ ఎవ‌రో ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు బ‌రిలో ఉంటార‌నేది ఇంకా క్లారిటీ రాలేదు పార్టీ ప‌రంగా.

రాహుల్ గాంధీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు తాను బ‌రిలో ఉండ‌డం లేద‌ని. కాగా పార్టీ చీఫ్ ఎన్నిక‌కు(Congress President Poll) సంబంధించి ద‌ర‌ఖాస్తుల‌ను స్వ‌క‌రించేందుకు సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు ఉంటుంది.

నామినేష‌న్ ప‌త్రాల‌ను అక్టోబ‌ర్ 1 వ‌ర‌కు జ‌రుగుతుంది. దాఖ‌లు చేసిన నామినేష‌న్ల‌ను విర‌మించేందుకు తుది గ‌డువు అక్టోబ‌ర్ 8గా నిర్ణ‌యించారు ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మిస్త్రీ. అనంత‌రం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు, అభ్య‌ర్థుల ఆధారంగా గుర్తులు కేటాయించ‌నున్నారు.

ఒక‌వేళ ఒక‌రు మాత్ర‌మే ఉంటే ఏక‌గ్రీవం అవుతుంది. కాక పోతే ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 19 త‌ర్వాత ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ వ‌స్తున్న సోనియా గాంధీ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటారు.

ఆమె స్థానంలో కొత్త వారు కొలువు తీర‌నున్నారు. ప్ర‌స్తుతానికి రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ పోటీలో ఉంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : జ్ఞాన వాపి కేసు తీర్పుపై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!