Congress Rebels : తగ్గేదే లేదంటున్న రెబ‌ల్స్

త‌ల ప‌ట్టుకున్న కాంగ్రెస్

Congress Rebels : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌ని త‌హ త‌హ లాడుతున్నకాంగ్రెస్ పార్టీకి రెబ‌ల్స్ బెడ‌ద త‌ల‌నొప్పిగా మారింది. ఎట్టి ప‌రిస్థితుల్లో తాము వెన‌క్కి త‌గ్గేదే లేదంటున్నారు. పార్టీ హైక‌మాండ్ ఆదేశాల మేర‌కు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే రంగంలోకి దిగారు. అసంతృప్తుల‌ను, టికెట్ లు రాలేని వాళ్ల‌కు హామీలు ఇస్తున్నారు. ప‌వ‌ర్ లోకి వ‌చ్చే సయ‌మం ఆస‌న్న‌మైంద‌ని, ఎందుకు ఇబ్బంది పెడ‌తారంటూ అనున‌యిస్తున్నారు.

Congress Rebels Comments Viral

ఇదిలా ఉండ‌గా సూర్యాపేట‌లో రెబ‌ల్ అభ్య‌ర్థిగా ప‌టేల్ ర‌మేష్ రెడ్డి బ‌రిలో ఉన్నారు. ఆయ‌న‌కు చివ‌రి దాకా టికెట్ ల‌భిస్తుంద‌ని అనుకున్నారు. గ‌త కొంత కాలం నుంచి పార్టీ కోసం ప‌ని చేస్తూ వ‌చ్చారు. 2018లో సైతం స‌ర్వేల‌లో ప‌టేల్ పేరుంది. కానీ అనూహ్యంగా హైక‌మాండ్ రామిరెడ్డి దామోద‌ర్ రెడ్డికి టికెట్ ఖ‌రారు చేసింది.

తాజాగా 2023లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో ర‌మేష్ రెడ్డికి టికెట్ రాలేదు. మ‌ళ్లీ రాం రెడ్డికే టికెట్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌ను ఓడించ‌డ‌మే త‌న లక్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇవాళ నామినేష‌న్లు ఉప‌సంహ‌రించు కునేందుకు ఆఖ‌రు తేదీ కావ‌డంతో నానా తంటాలు ప‌డుతున్నారు కాంగ్రెస్(Congress) సీనియ‌ర్లు.

ఇదిలా ఉండ‌గా త‌న‌ను పోటీ నుండి త‌ప్పుకోమ‌ని ఎవ‌రూ త‌న‌ను అడ‌గ‌లేద‌న్నారు. రేవంత్ రెడ్డి కూడా త‌న‌తో మాట్లాడ లేద‌న్నారు. ఎలాంటి బుజ్జ‌గింపుల‌కు త‌లొంచే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. మ‌రో వైపు త‌న‌ను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని ఓడించ‌డం త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మ‌రో నేత జంగా రాఘ‌వ రెడ్డి.

Also Read : Revanth Reddy : కేసీఆర్ దుకాణం బంద్

Leave A Reply

Your Email Id will not be published!