Congress Releases : కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
రెండో జాబితాలో 41 మందికి ఛాన్స్
Congress Releases : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే అధికార పార్టీ కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇప్పటి వరకు తొలి జాబితాను బుధవారం ప్రకటించగా గురువారం రెండో జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. రెండో జాబితాలో 41 మందికి అవకాశం ఇచ్చింది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డికే శివకుమార్ , మాజీ సీఎం సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీతో సమావేశం అయ్యారు. అనంతరం ఈ కీలక ప్రకటన(Congress Releases) వెలువడింది.
ఇదిలా ఉండగా వచ్చే మే నెల 10న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెలువడతాయి. మొత్తం 224 సీట్లు ఉన్నాయి. మొదటి జాబితాలో 101 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేస్తే ఇవాళ మరో 41 మంది క్యాండిడేట్స్ ను ప్రకటించింది.
దీంతో పార్టీ పరంగా ఇప్పటి వరకు 142 సీట్లకు తమ అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. ప్రాంతీయ సంస్థ సర్వోదయ కర్ణాటక పార్టీకి కూడా సీటును కేటాయించింది. ఆ పార్టీకి చెందిన దర్శన్ పుట్టన్నయ్యకు మేలుకోటే అసెంబ్లీ సీటును ఇచ్చింది.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ జాబితాకు ఆమోదం తెలిపారు. అంతకు ముందు కేసీ వేణుగోపాల్ , రాహుల్ గాంధీతో ఈ విషయంపై చర్చించారు. కర్ణాటక రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ రణ్ దీప్ సూర్జేవాలా కూడా హాజరయ్యారు.
Also Read : భారీగా పెరిగిన కరోనా కేసులు