Hardik Patel : హార్దిక్ ప‌టేల్ పై కాంగ్రెస్ సెటైర్

బీజేపీ గౌర‌వ్ యాత్ర‌లో పేరు లేదు

Hardik Patel : గుజ‌రాత్ లో బ‌ల‌మైన వ‌ర్గానికి నాయ‌కుడిగా పేరొందారు హార్దిక్ ప‌టేల్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప‌టేల్ ఉన్న‌ట్టుండి ఇటీవ‌ల భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. త్వ‌ర‌లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్కడ పాగా వేసేందుకు కాంగ్రెస్, ఆప్, బీజేపీ పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

ప్ర‌స్తుతం గుజ‌రాత్ లో బీజేపీ కొలువుతీరి ఉంది. కంటిన్యూగా కొన‌సాగుతూ వ‌స్తోంది. అయితే బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌నాన్ని మ‌రింత చైత‌న్యం చేసేందుకు గుజ‌రాత్ గౌర‌వ్ యాత్ర‌ను చేప‌ట్టింది. ఇందులో భార‌తీయ జ‌న‌తా పార్టీ జాబితాకు సంబంధించిన నాయ‌కుల‌లో హార్దిక్ ప‌టేల్ పేరు క‌నిపించ లేదు.

దీనిని ప్రత్యేకంగా ప్ర‌స్తావించింది కాంగ్రెస్ పార్టీ. ఆయ‌న ప‌ట్ల కాషాయం అత్యంత గౌర‌వ పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించిందంటూ ఎద్దేవా చేసింది. త‌మ పార్టీ నుంచి వెళ్లినా చివ‌ర‌కు అక్క‌డ కూడా అవ‌మానమే మిగిలిందంటూ పేర్కొంది కాంగ్రెస్. హాజ‌రైన నాయ‌కుల‌లో ఆయ‌న పేరు లేక పోవడాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది.

గురువారం కాంగ్రెస్ పార్టీ దీనిని ప్ర‌స్తావిస్తూ ఎగ‌తాళి చేసింది హార్దిక్ ప‌టేల్(Hardik Patel)  ను. ఇదిలా ఉండ‌గా త‌న‌కు పార్టీలో స‌రైన గుర్తింపు, ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదంటూ ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ పార్టీపై ప‌టేల్. తీరా ఇక్క‌డికి బీజేపీకి వెళ్లినా అక్క‌డ కూడా సేమ్ సీన్ ఎదుర‌వుతోందంటూ గుర్తు చేసింది. ఇదిలా ఉండ‌గా త‌న‌పై సెటైర్లు విసిరిన కాంగ్రెస్ పార్టీపై ఇంకా హార్దిక్ ప‌టేల్ స్పందించ లేదు.

పార్టీ ఆరోపించినంత మాత్రాన ప‌టేల్ సేవ‌లు ఎందుకు వాడుకోమంటోంది బీజేపీ.

Also Read : ‘గాంధీలు’ పార్టీని డిక్టేట్ చేయ‌రు – ఖ‌ర్గే

Leave A Reply

Your Email Id will not be published!