Congress Satire : ప్ర‌ధాని మోదీపై కాంగ్రెస్ సెటైర్

ట్విట్ట‌ర్ ను భ‌య‌పెట్టార‌న్న మాజీ సీఇఓ

Congress Satire : భార‌త దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న దానికి అర్థమే లేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ట్విట్ట‌ర్ మాజీ సిఇవో జాక్ డార్సే. ఆయ‌న ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు కేంద్రంలో కొలువు తీరిన న‌రేంద్ర మోదీ(Narendra Modi) ప్ర‌భుత్వంపై. ట్విట్ట‌ర్ ను అధికారం ఉంది క‌దా అని నియంత్రించేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని, విన‌క‌పోతే దాడుల‌కు దిగుతామ‌ని హెచ్చ‌రించార‌ని, ఆపై కుద‌ర‌క పోతే కేసులు న‌మోదు చేసి అరెస్ట్ లు కూడా చేస్తామంటూ బెదిరింపుల‌కు దిగారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఎలా ప్ర‌జాస్వామ్య దేశం అవుతుందంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ ను టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్ కొనుగోలు చేశారు.

భార‌త దేశంలో తాను సీఇవోగా ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అదేమిటంటే కేంద్రం తీసుకు వ‌చ్చిన సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు సంఘ‌టిత‌మై పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. చివ‌ర‌కు మోదీ దిగి వ‌చ్చారు. సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో పెద్ద ఎత్తున ట్విట్ట‌ర్ లో భారీ ఎత్తున రైతుల‌కు , ఉద్య‌మానికి, ఆందోళ‌న‌కు, నిర‌స‌న‌కు మ‌ద్ద‌తు ల‌భించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డా లేని రీతిలో స్పంద‌న ల‌భించ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితులలో ట్విట్ట‌ర్ ను టార్గెట్ చేశార‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో బెదిరింపులు కూడా వ‌చ్చాయ‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం మాజీ సిఇవో చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ మేర‌కు కార్టూన్ కూడా షేర్ చేసింది. నియంత‌లు చ‌రిత్ర‌లో పిరికి వాళ్లుగా ఉన్నార‌ని ఎద్దేవా చేసింది.

Also Read : Avinash Reddy Bail : అవినాశ్ రెడ్డి బెయిల్ కేసు వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!