Congress Seniors : కాంగ్రెస్ సీనియర్లకు నో ఎంట్రీ
పార్టీ హైకమాండ్ బిగ్ షాక్
Congress Seniors : న్యూఢిల్లీ – తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రానికి సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే 5 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ను ప్రకటించింది.
దీంతో పార్టీ పరంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీలను ఇప్పటికే ఏఐసీసీ ఖరారు చేసింది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 119 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ , తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు.
Congress Seniors Issue
ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్(Congress) స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ వార్ రూమ్ లోకి సీనియర్ లీడర్లు షబ్బీర్ అలీ, బలరాం నాయక్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. వారిని లోపలికి రానివ్వలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.
తమ సీనియార్టీని పరిగణలోకి తీసుకోక పోవడం, తమను అవమానించడం దారుణమని లోలోపేట మధనపడ్డారు. తమకు వార్ రూమ్ లోకి పర్మిషన్ ఇవ్వక పోవడంతో వెనుదిరిగారు. పెట్టే బేడా సర్దుకుని షబ్బీర్ అలీ, బలరాం నాయక్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. మొత్తంగా టికెట్ల ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది.
Also Read : CM KCR Nominations : 9న సీఎం కేసీఆర్ నామినేషన్లు