Congress Shock : కాంగ్రెస్ కు డీసీసీ చీఫ్ గుడ్ బై
గద్వాలలో పార్టీకి బిగ్ షాక్
Congress Shock : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు మరింత వేడిని రాజేస్తున్నాయి. పోటా పోటీగా వలసలు, జంపింగ్ జపాంగ్ లు ఎక్కువై పోయారు. ఆ పార్టీ నుంచి ఈపార్టీకి ఈ పార్టీ నుంచి ఆపార్టీ లోకి మారుతున్నారు. ఎవరు ఎటు వైపు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి పలువురు సీనియర్ నాయకులు, టికెట్లు రాని వాళ్లు కొందరు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. మరికొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
Congress Shock Due to Candidates Resigning
ఇక కాంగ్రెస్ లోకి వలసలు భారీగా పెరగడంతో ఆ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. మరో వైపు టికెట్లు రాని వాళ్లు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. దీంతో తట్టుకోలేక ఏకంగా గాంధీ భవన్ కు తాళం వేశారు. ఎవరూ రాకుండా. ఇదంతా పక్కన పెడితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి(Congress) బిగ్ షాక్ తగిలింది.
గద్వాల జిల్లా డీసీసీ చీఫ్ గా ఉన్న పటేల్ ప్రభాకర్ రెడ్డి హస్తానికి చేయి ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన తనకు టికెట్ వస్తుందని ఆశించారు. కానీ ఊహించని రీతిలో వేరొకరికి టికెట్ దక్కింది. ఇదే సమయంలో పార్టీ కార్యదర్శిగా ఉన్న కురువ విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రూ. 10 కోట్లు, 5 ఎకరాల భూమి తీసుకుని టికెట్ అమ్ముకున్నాడని ఆరోపించారు.
ఈ సమయంలో పటేల్ తో పాటు ముఖ్య అనుచరులు పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి హరీశ్ రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Also Read : BJP List : బీజీపీ లిస్టుపై వీడని ఉత్కంఠ