Congress Shock : మైనంపల్లి చేరిక కాంగ్రెస్ లో సెగ
ఇద్దరు డీసీసీ చీఫ్ లు రాజీనామా
Congress Shock : హైదరాబాద్ – బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు తనయుడతో పాటు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు వేముల వీరేశం కూడా జంప్ అయ్యారు.
Congress Shock Viral
ఇదిలా ఉండగా మైనంపల్లి హనుమంతరావు చేరికను కాంగ్రెస్ పార్టీ(Congress) సీనియర్లు, డీసీసీ చీఫ్ లు జీర్ణించు కోలేక పోతున్నారు. కొన్నేళ్లుగా తాము పార్టీని నమ్ముకుని పని చేస్తున్నామని కానీ ఉన్నట్టుండి అధికార పార్టీ నుంచి టికెట్ రాక పోవడంతో ఇక్కడ జంప్ అయ్యాడంటూ ఆరోపించారు.
మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. దీనిపై భగ్గుమన్నారు డీసీసీ చీఫ్ లు. ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మెదక్ డీసీసీ చీఫ్ తిరుపతయ్య పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఆయనతో పాటు తాజాగా మల్కాజ్ గిరి జిల్లా చీఫ్ నందికంటి శ్రీధర్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. సర్వేల ఆధారంగానే పార్టీకి సంబంధించి టికెట్లు ఇస్తామని బాకాలు ఊదారని ఇప్పుడు ఎలా మైనంపల్లికి టికెట్లు ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇదంతో దో నెంబర్ దందాగా మారిందంటూ మండిపడ్డారు.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ