Congress Shock : బీఆర్ఎస్ పేపర్..ఛానల్ కు నో ఎంట్రీ
సంచలన నిర్ణయం తీసుకున్న టీపీసీసీ
Congress Shock : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9న దేశంలోని 5 రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగించింది. షెడ్యూల్ ఖరారు చేయడంతో అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి.
Congress Shock – Some News Channels Not Allowed
ఇదే సమయంలో అధికార పార్టీ బీఆర్ఎస్(BRS) కు చెందిన పత్రికలు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేతో పాటు న్యూస్ ఛానల్ టీ న్యూస్ లకు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ మేరకు తమపై కక్ష సాధింపు చర్యగా పనిగట్టుకుని ఉన్నవి, లేనివి కల్పించుకుని ఆరోపణలు చేస్తూ వస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి.
గత కొంత కాలంగా వ్యక్తిగతంగా తమ పార్టీకి నష్టం కలిగించేలా నీచపు రాతలు, నిరాధారమైన ఆధారాలు లేకుండా వార్తలు , కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ పార్టీలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయని, తమ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందంటూ రాయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
దీంతో గాంధీ భవన్ లోకి టీ న్యూస్ , నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేలకు ప్రవేశం లేదని ప్రకటించారు ఎనుముల రేవంత్ రెడ్డి.
Also Read : Nagam Janardhan Reddy : టికెట్లు అమ్ముకుంటున్న రేవంత్