KTR : మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచిత విద్యుత్ విషయంలో సన్నాసి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు కేటీఆర్(KTR). రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో క్షమాపణలు చెప్పాలని లేక పోతే వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలలో 10 గంటలకు మించి ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంట్ కష్టాలు కావాలా లేక కేసీఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ కావాలా అని ప్రజలను అడుగుతామని అన్నారు మంత్రి కేటీఆర్.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఏ మాత్రం రైతుల పట్ల అవగాహన ఉందో తెలుస్తుందన్నారు. ఆయనను ఎందుకు పార్టీ చీఫ్ గా నియమించారో పార్టీ హైకమాండ్ ఆలోచించు కోవాలని అన్నారు కేటీఆర్. పార్టీకి చెందిన నాయకులు , కార్యకర్తలు విస్తృతంగా కాంగ్రెస్ ఉచిత కరెంట్ విధానం ఏమిటనే దానిపై నిలదీయాలని పిలుపునిచ్చారు.
24 గంటలు కరెంట్ ఇస్తేనే ఇవాళ వ్యవసాయం పండుగలా మారిందన్నారు. కానీ మరి అదే కాంగ్రెస్ 3 గంటలు మాత్రమే సరఫరా చేస్తే ఎలా పంటలు పండిస్తారని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. రాబోయే రోజుల్లో ప్రజలు, రైతులు తగిన రీతిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు మంత్రి. గతంలో ఇలాగే చేసి కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు.
Also Read : Arvind Kejriwal : వరద బాధితులకు సీఎం భరోసా
