Congress Slams : కేటీఆర్ కామెంట్స్ కాంగ్రెస్ సీరియస్
ప్రచారం మానుకోకుంటే తప్పదు చర్య
Congress Slams : హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగింది కాంగ్రెస్ పార్టీ. తమపై తప్పుడు ప్రచారాన్ని మానుకోకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నప్పుడే తప్పుడు ఆరోపణలు, చిల్లర వేషాలు వేశాడంటూ కేటీఆర్ పై మండిపడింది.
Congress Slams KTR
ప్రవళ్లిక గ్రూప్స్ కు దరఖాస్తు చేయలేదంటూ ఫేక్ స్టేట్ మెంట్ ఇచ్చాడని, నిరుద్యోగులు కాని వారితో ములాఖత్ పేరుతో మోసం చేశాడని ఆరోపించింది కాంగ్రెస్(Congress). మంగళవారం ట్విట్టర్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేసింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరుతో తప్పుడు లేఖ సృష్టించారని, దానిని ఆధారంగా చేసుకుని ఫాక్స్ కాన్ కంపెనీని తరలించుకు పోవాలని కుట్ర పన్నాడంటూ లేని పోని ఆరోపణలు చేశాడంటూ ఆరోపించింది కేటీఆర్ పై.
ఇదే సమయంలో ప్రస్తుతం సీఎం సిద్దరామయ్యపై అవాకులు చెవాకులు పేలుతున్నాడంటూ మండిపడింది. ఇలాంటి బేస్ లెస్ కామెంట్స్ పై ముందుగానే పసిగట్టిన జనం ఇంట్లో కూర్చోబెట్టారంటూ స్పష్టం చేసింది. ఇకనైనా తన స్థాయికి తగిన వ్యాఖ్యలు చేయాలని సూచించింది కాంగ్రెస్ పార్టీ.
Also Read : CM Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమీక్ష