Congress Slams : గువ్వ‌ల బాలరాజు ఓ గూండా

మాజీ ఎంపీ మ‌ల్లుర‌వి కామెంట్

Congress Slams : అచ్చంపేట‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వ‌ల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ(Congress) అభ్య‌ర్థి డాక్ట‌ర్ చిక్కుడు వంశీకృష్ణ మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల యుద్దం కొన‌సాగింది. పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. కావాల‌ని అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్న ఘ‌న‌మైన చ‌రిత్ర బాల‌రాజుకు ఉంద‌న్నారు మాజీ ఎంపీ మ‌ల్లుర‌వి. ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు.

Congress Slams Guvvala

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను నానా రకాలుగా హింసించాడ‌ని ఆవేద‌న చెందారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ప్ర‌జాద‌ర‌ణ లేద‌న్న అక్క‌సుతో డ‌బ్బు సంచుల‌తో రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తున్నాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్ర‌జ‌ల‌కు నోట్ల క‌ట్ట‌ల‌ను పంచేందుకు గువ్వ‌ల బాల‌రాజు బ‌య‌లు దేరాడ‌ని, దీనిని గ‌మ‌నించి త‌మ పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వెంబ‌డించార‌ని దీనిలో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు మ‌ల్లు ర‌వి. మా వారిపై గువ్వ‌ల‌, ఆయ‌న అనుచ‌రులు దాడికి పాల్ప‌డ్డార‌ని తిరిగి తామే దాడి చేశారంటూ ఆరోపించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. గువ్వ‌ల కేవ‌లం ప్ర‌జ‌ల నుంచి సానుభూతి పొందేందుకు ఇలా దొంగ నాట‌కం ఆడుతున్నాడంటూ మ‌ల్లుర‌వి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తామ‌న్నారు.

Also Read : Komatireddy Venkat Reddy : కోమ‌టిరెడ్డి దాదాగిరి

Leave A Reply

Your Email Id will not be published!