Congress Slams Modi : డబుల్ ఇంజన్ సర్కార్ పజిల్
కాంగ్రెస్ పార్టీ మోదీపై పోస్టర్
Congress Slams Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆయన పదే పదే చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కార్ గురించి ఎద్దేవా చేసింది. ఈ మేరకు మోదీ పోస్టర్ ను షేర్ చేసింది. మంగళవారం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఈ ఫోటో హల్ చల్ చేస్తోంది. మోదీలోని షేడ్స్ ను ఈ పిక్చర్ వ్యక్తం చేసేలా మండిపడింది.
Congress Slams Modi Ruling
ఎక్కడుంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ నిలదీసింది. ఓ వైపు మణిపూర్ మండుతోంది. ఇంకో వైపు దేశంలో ఎక్కడ చూసినా విద్వేషాల దాడులు కొనసాగుతున్నాయని వాపోయింది. పార్లమెంట్ లో ప్రశ్నిస్తే వేటు వేస్తారా అంటూ మండిపడింది.
గుజరాత్ మోడల్ అంటూ దేశంలో పవర్ లోకి వచ్చిన ప్రధాన మంత్రి మోదీ ఇప్పుడు మణిపూర్ మోడల్ తీసుకు వస్తారా అంటూ ఎద్దేవా చేసింది. విదేశాలలో పర్యటించాలన్న కాంక్ష తప్ప , వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడడం తప్ప దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేదని ఆరోపించింది కాంగ్రెస్(Congress) పార్టీ.
ఇప్పటికైనా మోదీ మారాలని, పార్లమెంట్ సాక్షిగా దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేకపోతే జనం క్షమించరని పేర్కొంది. మొత్తంగా మోదీ డబుల్ ఇంజన్ సర్కార్ ఓ అంతు చిక్కని పజిల్ గా మారిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ.
Also Read : Prathinidhi Movie : ప్రతినిధి మూవీ పోస్టర్ సూపర్