Congress Slams : కేంద్రం నిర్వాకం కాంగ్రెస్ ఆగ్రహం
యంగ్ ఇండియన్ ఆఫీస్ కు తాళం
Congress Slams : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో ఏ ఒక్క పార్టీ తనకు వ్యతిరేకంగా ఉండ కూడదనే టార్గెట్ తో దూసుకు పోతోంది భారతీయ జనతా పార్టీ.
ఆ పార్టీకీ అన్నీ తానై ముందుకు నడిపిస్తూ వస్తున్న రథ సారథి మోదీ ఎప్పుడు ఎవరిని ఎలా దెబ్బ కొడుతున్నారో తెలియని స్థితికి నెట్టి వేశారు. మరాఠాలో మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలి పోయింది.
తనను ఎదిరించిన బెంగాల్ లో మంత్రిని లోపల వేశారు. ఇక నిన్నటి దాకా బీరాలు పలికి మోదీ త్రయం పై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చిన తెలంగాణ సీఎం ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియడం లేదు.
ఈడీ రంగంలోకి దిగింది. ఇక బీజీపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని(Congress Slams) నామ రూపాలు లేకుండా చేయాలన్నది బీజేపీ టార్గెట్. ఆ దిశగానే ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది.
ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీలకు సమన్లు పంపించింది. రాహుల్ ను ఐదు రోజుల పాటు సోనియా ను మూడు రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది.
ఆపై నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహిస్తున్న యంగ్ ఇండియన్ ఆఫీస్ కు తాళం వేసింది. ఊహించని రీతిలో ఈడీ షాక్ ఇవ్వడంతో ఖంగుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు.
ఈ సందర్భంగా తమ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని, సోనియా , రాహుల్ నివాసాలను లక్ష్యంగా చేసుకుని పోలీసులను భారీగా మోహరించారంటూ ఆరోపించారు.
సీనియర్ నాయకులు జై రాం రమేష్ , అజయ్ మాకెన్ , అభిషేక్ సింఘ్వీ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడాన్ని తట్టుకోలేక ఇలాంటి చవకబారు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.
Also Read : పార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టులో ఎల్ఐసీ