Congress Slams : ఇండియా అంటే భయం పట్టుకుందా
మోదీని నిలదీసిన కాంగ్రెస్ పార్టీ
Congress Slams : ప్రధానమంత్రి ఎన్డీయే సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆయనలో భయాన్ని కలిగిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ట్విట్టర్ వేదికగా పీఎంను ప్రశ్నించింది. ఒక రకంగా విపక్షాలన్నీ కలిసి ఒకే వేదికపైకి రావడాన్ని ఆయన తట్టుకోలేక పోతున్నారని పేర్కొంది. 9 ఏళ్లపాటు అధికారంలో ఉన్న మోదీ ఈ దేశానికి ఏం చేశారో చెప్పాలని నిలదీసింది. కాంగ్రెస్ హయాంలో కాపాడుకుంటూ వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా తన వారికి అమ్మేశారంటూ ఆరోపించింది.
Congress Slams Modi
ఆయన చేసిన నిర్వాకానికి ఇవాళ దేశం మొత్తం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి వేయబడిందని ఆవేదన వ్యక్తం చేసింది. మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ హయాంలో చెప్పుకునేందుకు ఏమీ లేదు..అందుకే ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారంటూ ఆరోపించింది.
దేశంలోనే అతి పెద్ద అదానీ కుంభకోణాన్ని ముక్కు కింద పెట్టుకున్న ప్రధానికి అవినీతిపై నోరు విప్పేందుకు ఎంత ధైర్యమని మండిపడింది కాంగ్రెస్(Congress) పార్టీ. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులను బెదిరించడం, ఎదురు తిరిగితే కేసులు నమోదు చేయడం లేదంటే తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వంద్వ ప్రమాణాలు సూచించడం లేదా అని మండిపడింది.
ఇన్నేళ్లుగా ప్రతి రోజూ అబద్దాలను ప్రచారం చేస్తూ వచ్చారంటూ ఎద్దేవా చేసింది. ప్రజా ధనాన్ని ఖర్చు చేసి విచ్చలవిడిగా విదేశీ పర్యటనలు చేసిన ఘనత మీకే దక్కుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ.
Also Read : Mamata Banerjee : ఎన్డీయేకు ‘ఇండియా’నే ప్రత్యామ్నాయం